నన్ను బాధ పెట్టారు.. ఇక మూల్యం తప్పదు: ట్రంప్ | Trump Responds to Iran's Rejection of Ceasefire | Sakshi
Sakshi News home page

నన్ను బాధ పెట్టారు.. ఇక మూల్యం తప్పదు: ట్రంప్

Apr 6 2026 9:26 PM | Updated on Apr 6 2026 9:26 PM

Trump Responds to Iran's Rejection of Ceasefire

హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌కు అమెరికా డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును ఇరాన్‌ బేఖాతరు చేసింది. బెదిరింపులతో చర్చలు జరగవని తేల్చిచెప్పింది. అయితే తాజాగా ఇరాన్ రియాక్షన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.

పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ వైపేమై ట్రంప్ దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్‌లో ఉన్న విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే వాటిని ఇరాన్‌ పట్టించుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు తలొగ్గేది లేదని తేల్చి చెబుతుంది. తాజాగా సీజ్‌ఫైర్‌ ఒప్పందాన్ని సైతం తిరస్కరించింది. దీంతో ట్రంప్ తీవ్ర ఆవేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ మాట్లాడుతూ" ఇరాన్ సీజ్‌ ఫైర్‌ ఒప్పందాన్ని తిరస్కరించడం నన్ను తీవ్రకలతకు గురి చేసింది. దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఇరాన్‌ అనుకుంటే ఈ పరిస్థితి ముగిసిపోయేది. అది వారికి తెలుసు క్రితం వారితో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వివేకవంతులు" అని ట్రంప్ అన్నారు.

ఇటీవల ఇరాన్‌ భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు ఫైలట్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతో ట్రంప్‌ డిమాండ్స్‌కు ఇరాన్ తలొగ్గకపోవడంతో  ఇప్పుడు అమెరికా పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement