డామిట్.. కథ అడ్డం తిరిగింది..! | USA Donald Trump Master Plans Not Workout What Next | Sakshi
Sakshi News home page

డామిట్.. కథ అడ్డం తిరిగింది..!

Apr 6 2026 9:34 PM | Updated on Apr 6 2026 9:49 PM

USA Donald Trump Master Plans Not Workout What Next

ఇరాన్‌,..  యుద్ధ రీతిలో అమెరికాకు ఏమాత్రం అర్థం కావడం లేదు.. అమెరికా అనడం అంటే కూడా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏమాత్రం అంతు చిక్కడం లేదు ఇరాన్‌.  ఇరాన్‌తో యుద్ధం రోజులు, నెలలు గడుస్తున్నా అమెరికా ఇంకా డెడ్‌లైన్లతోనే సరిపెడుతుంది. మూడు వారాలలోపే ఇరాన్‌తో యుద్ధంపై చర్చలకు సిద్ధం అంటూ ప్రకటించిన ట్రంప్‌.. ఆ దేశానికి గడువులు విధిస్తూనే ఉన్నారు. 

ఆ దేశం హార్మూజ్‌ జలసంధిని తెరవకపోతే అంటూ 48 గంటలు డెడ్‌లైన్‌ విధించిన ట్రంప్‌.. ఇప్పుడు మరో 24 గంటలంటూ డెడ్‌లైన్‌ అంటూ ప్రకటించారు. అంటే ఇక్కడ ట్రంప్‌ వార్నింగ్‌లకే పరిమితం అవుతున్నారు తప్ప  ఇరాన్‌పై పట్టుసాధించే ప్రక్రియ మాత్రం ప్రస్తుతానికి అందని ద్రాక్షగానే ఉంది.

మరొకవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ డెడ్‌లైన్లను ఇరాన్‌ అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఒకవైపు చర్చలకు డెడ్‌లైన్‌ అంటూ మాపై ఆ ప్రతీకార మాటలేంటి.. చర్చలకు వచ్చే వారు అలానే మాట్లాడతారా?, చర్చలు అనేవి సామరస్యపూర్వకంగా జరగాలే తప్ప  ఆ తుపాను మాటలేంటి అంటూ మండిపడుతోంది.  

అసలు ట్రంప్‌ మాటల్లోనే చర్చలు చేసే ధోరణే కనిపించడం లేదని, అటువంటి సమయంలో ఎలా చర్చలు జరుగుతాయని ప్రశ్నిస్తోంది. ఏం చేసుకుంటారో చేస్కోండి.. మీ  ఆ తరహా మాటలతో చర్చలు అనేవి కుదరనే కదరవు అని తెగేసి చెప్పేసింది. ఈ వార్తను తెలుసుకున్న ట్రంప్‌.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.  ఇరాన్‌ ప్రకటనతో చాలా నిరాశ చెందానని ట్రంప్‌ తన మాటల ద్వారా తెలియజేశారు. 

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం గట్టిగా చేస్తే అమెరికా పౌరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది.. మరొకవైపు ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది.  ఇటువంటి తరుణంలో ఏం చేయాలి అనే పునరాలోచనలో పడ్డారు. ముందుకేస్తే గొయ్యి.. వెనుకకు వస్తే నుయ్యి అన్న చందంగా మారింది ట్రంప్‌ పరిస్థితి.  

‘ఇక ఏం చేయాలి నేను.. వార్నింగ్‌లు మీద వార్నింగ్‌లు ఇస్తున్నాం.. డెడ్‌లైన్‌ విధించాం. అగ్రరాజ్యంగా చేయాల్సినదంతా చేశాం.. ఇలా చిక్కుకుపోయామేంటి.. ఇప్పటివరకూ నాకు ఎదురేలేదని అనుకున్నా.. ఇరాన్‌ ఇలా తగులుకుందేమిటి.. అసలు ఇరాన్‌తో యుద్ధం చేయాలనే ఇజ్రాయెల్‌ వ్యూహంలో ఎలా చిక్కుకున్నాం. ప్రశాంతంగా అమెరికా అధ్యక్షుడిగా గౌరవంగా బ్రతికాల్సిన నేను ఇలా అయిపోయానేంటి.. ఏ దేశం కూడా నాకు సాయం చేయడం లేదు.  సాయం అడిగితే  ‘‘ఓ నో సారీ’’ అంటూ మిత్రదేశాలు సెలవిస్తున్నాయి. 

అనవసరంగా పరువు తీసుకున్నాం. ఎటు చూసినా ఇది మనకే తిప్పి కొట్టేలా ఉంది’ అని ట్రంప్‌ తన అంతరంగంలో మదన పడే ఉంటారు కదా.. డామిట్‌.. కథ అడ్డం తిరిగింది.. అనుకోవడం ట్రంప్‌ వంతై ఉంటుంది కూడా. 

మరి  ఇటువంటి తరుణంలో ట్రంప్‌ అన్నట్లు ఇరాన్‌కు చుక్కలు చూపిస్తారో.. తాడో-పేడో తేల్చుకుంటారో అనే సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ మళ్లీ ట్రంప్‌ యుద్ధానికి కాలు దువ్వితే మాత్రం మరింత విధ్వంసం జరగడం ఖాయం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement