17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు | Posed as Customs Officials Robbers looted 25 Crore Gold from Rajkot in Bihar | Sakshi
Sakshi News home page

17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు

Apr 6 2026 6:32 PM | Updated on Apr 6 2026 6:52 PM

Posed as Customs Officials Robbers looted 25 Crore Gold from Rajkot in Bihar

బీహార్‌లో  చోటుచేసుకున్న భారీ దోపిడీ  అక్కడి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గుజరాత్‌లోని  రాజ్‌కోట్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారికి చెందిన రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని, అత్యంత పకడ్బందీగా, సినిమా ఫక్కీలో ప్లాన్‌ వేసి  కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్న  వైనం కలకలం రేపింది.

పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం రాజధాని పాట్నాలో దనాపూర్లోని ఖాగౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, దుండగులు బంగారు వ్యాపారి సిబ్బంది నుండి 17 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయలు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంస్థ కేవీ & సన్స్ లో మహేష్ మమ్తోరా, ప్రిన్స్ రాన్‌పారియా అనే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల డెలివరీ ఇచ్చేందుకు రైలులో బీహార్‌కు వెళ్లారు. అక్కడ వారు రైల్వే స్టేషన్‌లో దిగీ దిగగానే, పక్కా ప్లాన్‌తో మోటార్‌సైకిళ్లు,  కారులోవచ్చిన  సుమారు ఎనిమిది మంది దుండగులు వీరిని చుట్టుముట్టారు.

ఇదీ చదవండి: నో ఫుడ్‌,నో ఫోన్‌, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్‌ చేస్తే!

అదీ కస్టమ్స్ శాఖ అధికారులుమంటూ వారిని చుట్టుముట్టారు. విచారణ జరపాలంటూ వారిని  భయపెట్టారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనగానే బాధితులు కూడా నిజమైన అధికారులు కావొచ్చని భ్రమపడ్డారు. దీంతో బాధితులను కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత వారిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, వారి వద్ద ఉన్న రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం, దుండగులు అక్కడి నుండి ఉడాయించారు.  ఆ తర్వాత  తేరుకున్న బాధితులు సంస్థ యజమానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.ప్లాన్ తోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాజ్‌కోట్‌లోని 'సోని బజార్' వ్యాపారుల మధ్య ఆందోళన మరియు అలజడిని రేకెత్తించింది. 

ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

Advertisement
 
Advertisement
Advertisement