రికార్డుకు చేరువలో ఆర్టిమిస్‌–2  | Artemis II astronauts leave Earth orbit and blast toward moon | Sakshi
Sakshi News home page

రికార్డుకు చేరువలో ఆర్టిమిస్‌–2 

Apr 5 2026 1:13 AM | Updated on Apr 5 2026 1:13 AM

Artemis II astronauts leave Earth orbit and blast toward moon

వాషింగ్టన్‌: ఒక రోజంతా భూమి చుట్టూ తిరిగిన ఆర్టీమిస్‌–2 ప్రాజెక్ట్‌ వ్యోమగాములు ఇప్పుడు చంద్రుని దిశగా సగం దూరం ప్రయాణించి తదుపరి రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు సంసిద్ధమయ్యారు. 1970 ఏడాదిలో అపోలో–13 మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించారు. ఇప్పుడీ రికార్డ్‌ను ఆర్టీమిస్‌–2 వ్యోమగాములు బద్దలుకొట్టనున్నారు. 

ఓరియాన్‌ వ్యోమనౌకలోని నలుగురు వ్యోమగాములు శనివారం నాటికే భూమి నుంచి చంద్రుని దిశగా 1,36,080 మైళ్లు ప్రయాణించారు. త్వరలోనే చంద్రుడిని దాటి దాదాపు 2,52,000 మైళ్లదూరం వెళ్లనున్నారు. తద్వారా అపోలో–13 వ్యోమగాముల రికార్డ్‌ను వీళ్లు 53 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరిపేయనున్నారు. తర్వాత వీళ్ల వ్యోమనౌక యూటర్న్‌ తీసుకుని భూమి దిశగా ప్రయాణం కొనసాగిస్తుంది. 

ఆర్టిమిస్‌–2లో భాగంగా తమ దేశీయుడు వెళ్తుండటంపై కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సంబరాలు చేసుకుంది. కెనడా వ్యోమగామి జెరిమీ హన్సెన్‌తో క్యూబెన్‌ నగరంలోని కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ అధ్యక్షురాలు లీసా క్యాంప్‌బెల్‌ మాట్లాడి అభినందించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement