చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు.
కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాముల ఓరియన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. దీంతో పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది.
అయితే.. క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి గంటకు 24,000 మైళ్ల వేగంతో ప్రవేశించినప్పుడు విపరీతమైన వేడిని, దాని హీట్ షీల్డ్ సమర్థవంతంగా తట్టుకుంది.
మేం నలుగురం సేఫ్ అని ఆర్టెమిస్-2 కమాండర్ వైజ్‌మ్యాన్ ప్రకటించడంతో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా (NASA) తన X లో విడుదల చేసింది.


