ఇరాన్‌కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు
అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్
పశి్చమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం
130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు
క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు
నేలకూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు
కువైట్ పొరపాటున కూల్చేసింది: యూఎస్
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సోమవారం మూడో రోజు ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఏకంగా 130 నగరాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరైంది. పలు దఫాలుగా జరిగిన దాడులతో అక్కడి వాయుసేన, మిసైల్ కమాండ్ కేంద్రాలు దద్దరిల్లిపోయాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 600 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. 1,000 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై అమెరికా బి–2 స్టెల్త్ బాంబర్ విమానాలు 2,000 పౌండ్ల బరువైన భారీ బాంబులను జారవిడిచాయి. యుద్ధ నౌకలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. తమ సరిహద్దు ప్రాంతాలపైకి హెజ్బొల్లా క్షిపణులు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ మండిపడింది. లెబనాన్‌పైనా భారీస్థాయిలో దాడులకు దిగింది.
దాంతో హెజ్బొల్లా కీలక నేత మొహమ్మద్ రాద్‌తో పాటు 31 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. వందలాదిగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు బాంబు, క్షిపణి దాడులతో దద్దరిల్లాయి. జనం బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు.
ఇజ్రాయెల్‌లో ఇప్పటిదాకా 12 మంది దాకా మరణించినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలపైనా భారీగా దాడులు జరిగాయి. దాంతో యూఏఈలో ముగ్గురు, కువైట్, బహ్రెయిన్లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అమెరికా స్థావరాలనే గాక పౌర సదుపాయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆ దేశాలు మండిపడ్డాయి. తమను లక్ష్యం చేసుకోవడం మానకుంటే ఇరాన్‌పై భారీ దాడులు తప్పవని హెచ్చరించాయి.
మరోవైపు లెబనాన్, ఇరాక్ తదితర దేశాలకు చెందిన పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఇరాన్‌కు దన్నుగా యుద్ధరంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించాయి. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే భారీగా ప్రతీకార దాడులు చేసినట్టు లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికాకు దోహదపడతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి.
ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు ప్రకటించింది. వాటిలో పలు క్షిపణులను అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ వెంటనే లెబనాన్‌పై భారీగా క్షిపణి, బాంబు దాడులతో విరుచుకుపడింది.
దాంతో 31 మంది మరణించగా 149 మంది గాయపడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను లెబనాన్ ఖండించింది. అయినా ఆ దేశంపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్, అమెరికా దాడులతో టెహ్రాన్ అట్టుడికింది. జనం ఇళ్లకే పరిమితం కావడంతో నగర వీధులు ఎడారులను తలపించాయి.
ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ ప్రకటించారు. తమపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో చాలావరకు అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా సైనిక స్థావరంపై షియా మిలిటెంట్ సంస్థ డ్రోన్ దాడికి దిగింది. ఇరాన్ నూతన సుప్రీం నేతను అతి త్వరలో ఎన్నుకుంటామని అలీరెజా అరాఫీ తెలిపారు.
సౌదీ చమురు కేంద్రంపై దాడి
సౌదీ అరేబియాలోని రస్ తనౌరా చమురు శుద్ధి కేంద్రంపై సోమ వారం దాడులు జరిగాయి. దాంతో శుద్ధి కేంద్రం స్వల్పంగా దెబ్బతిన్నట్టు సమాచారం. సంబంధిత వీడియోల్లో అక్కడ నల్లని దట్టమైన పొగ అలముకుని కనిపిస్తోంది. దాంతో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల పై చిలుకు సామర్థ్యమున్న ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసేశారు. తనౌరా ప్రపంచంలోని అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటి. కువైట్‌లోనూ అహ్మదీ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ శకలాలు పడి ఇద్దరు కారి్మకులు గాయపడ్డట్టు ప్రభుత్వం పేర్కొంది.
నెతన్యాహు ఆఫీసుపైకి క్షిపణి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై సోమ వారం క్షిపణి దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. దాడిలో కార్యాలయం తీవ్రంగా దెబ్బ తిన్నట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాణాలతో ఉన్నదీ లేనిదీ అనుమానమేనని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పుకొచి్చంది. అయితే ఈ దాడి వార్తలను ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు. అంతేగాక ఇరాన్ ప్రకటన వెలువడ్డ కొద్ది గంటలకే నెతన్యాహు బహిరంగంగా కని్పంచారు. బెయిట్ షెమె‹Ùలో ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బ తిన్న ప్రాంతాలను సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఆ దాడిలో 9 మంది ఇజ్రాయెలీలు మరణించారు.
మరో నాలుగైదు వారాలు: ట్రంప్
ఇరాన్‌పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే మరింత సుదీర్ఘ పోరుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇరాన్ దాడుల్లో మరణించిన నలుగురు అమెరికా సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘‘బాధాకరమే అయినా, యుద్ధం ముగిసేలోపు ఇలాటి మరణాలు మరిన్ని సంభవిస్తాయి. అది అనివార్యం. ఏమీ చేయలేం’’ అని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలన్నీ తమతో కలిసొస్తామంటున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ‘‘ప్రస్తుతానికి మాత్రం ఇరాన్‌పై దాడులు పూర్తిస్థాయి తీవ్రతతో కొనసాగుతాయి’’అని ప్రకటించారు.
ఇరాన్‌పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే మరింత సుదీర్ఘ పోరుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇరాన్ దాడుల్లో మరణించిన నలుగురు అమెరికా సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘‘బాధాకరమే అయినా, యుద్ధం ముగిసేలోపు ఇలాటి మరణాలు మరిన్ని సంభవిస్తాయి. అది అనివార్యం. ఏమీ చేయలేం’’ అని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలన్నీ తమతో కలిసొస్తామంటున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ‘‘ప్రస్తుతానికి మాత్రం ఇరాన్‌పై దాడులు పూర్తిస్థాయి తీవ్రతతో కొనసాగుతాయి’’అని ప్రకటించారు.
అమెరికా విమానాలను భారీగా కూల్చేశాం: ఇరాన్
కువైట్లో మూడు అమెరికా ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు నేలకూలాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో కువైట్ సేనలే వాటిని పొరపాటున కూల్చేసినట్టు అమెరికా ప్రకటించినా, ఇరాన్ మాత్రం అది తమ పనేనని చెప్పుకుంది. నిజానికి తమ దాడుల్లో అమెరికా ఇంకా భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను నష్టపోయిందని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడులతో సోమవారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ధూళి, పొగ


