india us trade deal: భారత్‌కు అమెరికా బంపరాఫర్‌ | America Slash Reciprocal Tariffs On India To 18 Percent | Sakshi
Sakshi News home page

భారత్‌కు అమెరికా బంపరాఫర్‌

Feb 5 2026 3:09 PM | Updated on Feb 5 2026 3:27 PM

America Slash Reciprocal Tariffs On India To 18 Percent

సాక్షి,ఢిల్లీ: భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అమెరికాతో జరిగిన ట్రేడ్‌ డీల్‌లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిఫలంగా అమెరికా.. భారత్‌కు విధించే ప్రతీకార పన్నును 18 శాతం తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.

అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌ సైతం 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రకటనపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పష్టత ఇచ్చారు. సీనియర్ అమెరికా అధికారులు వచ్చే వారం ఢిల్లీలో ఒప్పందంపై సంతకం చేయడానికి రానున్నట్లు చెప్పారు.  

కాగా, ఈ ఫిబ్రవరి 3న భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది రూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు కలిగేందుకు దోహదం చేయనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement