Kim Woo-bin, Shin Min-ah Wedding దక్షిణ కొరియాకు చెందిన నటి ,మోడల్ 41 ఏళ్ల షిన్ మిన్-ఆహ్ తన చిరకాల ప్రియుడు కిమ్ వూ-బిన్‌ను పెళ్లాడింది. డిసెంబర్ 20న సియోల్‌లోని జంగ్-గులోని ది షిల్లా హోటల్‌లోని రాయల్ హాల్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
గత పదేళ్లుగా సెలబ్రిటీ కపుల్‌గా పేరుతెచ్చుకున్న వీరిద్దరి వెడ్డింగ్‌కు దక్షిణ కొరియాలోని ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరిలో BTS V , PD నాహ్ యుంగ్-సుక్, దర్శకుడు చోయ్ డాంగ్-హూన్, రచయిత కిమ్ యున్-సూక్, కో డూ-సిమ్, లీ బైయుంగ్-హున్, పార్క్ క్యుంగ్-లిమ్, ఉహ్మ్ జంగ్-హ్వా, గాంగ్ హ్యో-జిన్, కిమ్ యుయి-సుంగ్, యూన్ క్యుంగ్-హో, బే సియోంగ్-వూ, ఇమ్ జూ-హ్వాన్, కిమ్ టే-రి, ర్యు జున్-యెయోల్, అన్ బో-హ్యూన్, నామ్ జూ-హ్యూక్, బే జంగ్-నామ్ తదితరులు ఉన్నారు.

షిన్ మిన్-ఆహ్ బ్రైడల్ గౌను
మిన్-ఆహ్ ఐకానిక్ లెబనీస్ ఫ్యాషన్ హౌస్ ఎల్లీ సాబ్ బ్రైడల్ గౌనును ఎంచుకుంది. స్ప్రింగ్ 2026 బ్రైడల్ కలెక్షన్‌లోని అందమైన తెల్లని గౌనులో అందంగా మెరిసింది. సొగసైన నెట్టెడ్ వీల్ భారీ గౌను ధర రూ. 25.6 లక్షలు. కిమ్ వూ-బిన్ రాల్ఫ్ లారెన్ పర్పుల్ లేబుల్ సూట్‌ను ధరించాడు.
ప్రియుడికి కేన్సర్ వచ్చినపుడు మరింత ప్రేమతో
షిన్ మిన్-ఆహ్, కిమ్ వూ-బిన్ మొదటిసారి 2015లో ఒక ప్రకటన వాణిజ్య ప్రకటనలో కలుసుకున్నారు. 2015 నుంచి డేటింగ్ ప్రారంభించారు. 2017లో కిమ్ వూ-బిన్‌కు నాసోఫారింజియల్ క్యాన్సర్ సోకినపుడు షిన్ అతనికి సపోర్ట్‌గా నిలిచింది.పరస్పరం గౌరవించుకుంటూ, కరియర్‌లో ఎంతో కీర్తిని, ప్రజాదరణ పొందారు. దాదాపు దశాబ్దం తర్వాత,వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరికి కోట్లాది మంది అభిమానులు శుభాకాంక్షలు అందించారు.


