డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)
ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్‌ని అడగ్గా..'స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?
(ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు)


