కశ్చిరీలకు మద్దతుగా పాక్‌లో ర్యాలీలు  | Pakistan diplomatic missions observe Kashmir Solidarity day | Sakshi
Sakshi News home page

కశ్చిరీలకు మద్దతుగా పాక్‌లో ర్యాలీలు 

Feb 6 2026 1:22 AM | Updated on Feb 6 2026 1:22 AM

Pakistan diplomatic missions observe Kashmir Solidarity day

ఇస్లామాబాద్‌: కశ్చిరీ ప్రజలకు సంఘీభావంగా గురువారం పాకిస్తాన్‌ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. జమ్మూకశ్చిర్‌ సమస్యకు పరిష్కారం కశ్చిర్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమేనని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. కశ్చిర్‌ సాలిడారిటీ డేను పురస్కరించుకుని ముజఫరాబాద్‌లోని పీవోకే అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కశ్చిర్‌ పాకిస్తాన్‌లో భాగంగా మారనుందన్నారు. పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు జిన్నా ప్రకటించిన విధంగానే దేశ విదేశాంగ విధానానికి కశ్చిరే ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు. 

కశ్చిర్‌ అంశాన్ని పాలస్తీనాతో ముడిపెట్టిన షెహబాజ్‌ షరీఫ్‌ ఈ సందర్భంగా హతులైన ఉగ్రవాదులు బుర్హాన్‌ వనీ, సయ్యద్‌ అలీ జిలానీ వంటి వారి పేర్లను ప్రస్తావించారు. అనంతరం సరిహద్దుల్లోని ఫార్వర్డ్‌ పోస్ట్‌ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ఆసిమ్‌ మునీర్, అధ్యక్షుడు జర్దారీ కూడా కశ్చిర్‌ ప్రజలకు సంఘీభావం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. సదస్సులు, సమావేశాలతోపాటు ఉదయం 10 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం మౌనం పాటించినట్లు ప్రభుత్వ రేడియో వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement