కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.
స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్‌సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
వారికి మినహాయింపు
2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్‌యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారతీయులపై ప్రభావం
ఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్‌లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్‌బర్డ్స్


