వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే! | Top Cars Launching In February 2026, SUVs, EVs And Luxury Models Hit The Indian Market, Watch Video For Details | Sakshi
Sakshi News home page

వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!

Feb 5 2026 9:01 PM | Updated on Feb 6 2026 1:18 PM

Car Launches in India 2026 February From Nissan Tekton To Tata Sierra EV

సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

నిస్సాన్ టెక్టెన్‌: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్‌పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement