సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్ ఎస్‌యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.
మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.
ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి
వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.


