ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.
ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.
ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.
ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?
గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
LESSON # 9: How to get richer as the world economy crashes.
The FED just let the world know their plans for the future.
The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025


