తగ్గిన బంగారం దిగుమతులు: నవంబర్‌లో 60 శాతం.. | Gold imports Down 60 Percent in November | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం దిగుమతులు: నవంబర్‌లో 60 శాతం..

Dec 16 2025 6:00 PM | Updated on Dec 16 2025 6:19 PM

Gold imports Down 60 Percent in November

దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌లో 4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2024) నవంబర్‌లో 9.8 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి.

2025 అక్టోబర్‌లో మూడు రెట్లు ఎగసి 14.72 బిలియన్‌ డాలర్లను తాకిన పసిడి దిగుమతులు ఈ ఏడాది(2025) ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో 3.3 శాతం పెరిగి 45.26 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 43.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి 24.53 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. దిగుమతులు నీరసించడంతో దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement