బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా.. యాక్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ న్యూ ఆఫర్. ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది.
ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోపకుమార్ తెలిపారు.


