సాధారణంగా చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలొ ఉంచుకుని పలు ఆటోమొబైల్ కంపెనీలు దాశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. అయితే ఐఐటి బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసింది. ఇది మామూలు వాహనాల కంటే భిన్నంగా శక్తిని వినియోగించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ..
ఐఐటీ బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్.. రూపొందించిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు బిబ్యా 1.1 (Bibtya 1.1). ఇది టాటా ఏస్ గోల్డ్. దీనికి సరికొత్త టెక్నాలజీని అమర్చి.. టెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ గమనించవచ్చు.
సాధారణంగా ఒక వెహికల్ పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా వాహనం నడుస్తుంది. కానీ ఇక్కడ రైజెన్ టెక్ రూపొందించిన హైబ్రిడ్ ఏలక్ట్రిక్ టాటా ఏస్ గోల్డ్ ట్రక్ దానికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే.. ఇందులోని ఇంజిన్ పెట్రోల్ ఉపయోగించి.. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ శక్తిని నేరుగా చక్రాలకు సరఫరా చేయదు. ఈ శక్తిని బ్యాటరీ తీసుకుని.. ఛార్జ్ చేసుకుంటుంది. ఈ ఛార్జ్ ద్వారా వాహనం నడుస్తుంది. తద్వారా.. పనితీరు కూడా పెరుగుతుంది.
ఇదీ చదవండి: శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిజానికి ఈ విధానం కొత్తగా ఉంది. టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఇది అన్నింటా సక్సెస్ సాధిస్తే.. ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలు సాధ్యమవుతాయి. అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్, బ్యాటరీ రెండూ ఉండటం వల్ల.. పేలిపోయే అవకాశం ఉందా?, ఒకవేళా బ్యాటరీ పనిచేయని సందర్భంగా పెట్రోల్‌తో మాత్రం వాహనం నడుస్తుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది, కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో లేదు. బహుశా దీనిని అన్ని విధాలా.. పరీక్షించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.


