ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో అగ్రస్థానంపై కన్నేసిన ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ చార్జింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా డీలర్ పార్ట్‌నర్లు, చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో కలిసి 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.
ఈ–విటారా కారుకి 5 స్టార్ భారత్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ లభించిన సందర్భంగా కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే 1,100 పైగా నగరాల్లోని తమ సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్‌వ్యాప్తంగా 2,000 పైగా ఎక్స్‌క్లూజివ్ చార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్‌ను నెలకొల్పినట్లు చెప్పారు.
యాప్ తయారీ, దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్‌లో చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. తమ ’ఈ ఫర్ మి’ యాప్ ద్వారా చార్జింగ్ పాయింట్ల వివరాలను పొందవచ్చన్నారు. చార్జింగ్ నెట్‌వర్క్ దన్నుతో 2026లో ఈ–విటారా అమ్మకాలను ప్రారంభించనున్నట్లు వివరించారు.


