2025 దాదాపు ముగిసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లాంచ్ అయిన.. అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
టాటా హారియార్ ఈవీ
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టాటా హారియార్ ఈవీ.. 2025లో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఒక బెస్ట్ మోడల్. రూ.21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు.. ఒక ఫుల్ ఛార్జితో 627 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగల ఈ SUV AWD వేరియంట్‌లో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను (బూస్ట్, స్పోర్ట్, సిటీ & ఎకో), RWD వేరియంట్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లను (ఎకో, సిటీ & స్పోర్ట్) పొందుతుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగంలో.. 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.53-అంగుళాల హర్మాన్-సోర్స్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో డ్రైవర్ సీటు, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, విండో సన్‌బ్లైండ్‌లు, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్మార్ట్ (O), ఎక్సలెన్స్ LR అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 42kWh (390 కి.మీ), 51.4kWh (473 కి.మీ.) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. పెద్ద బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది, 11kW AC హోమ్ ఛార్జర్‌ను ఉపయోగించి 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది.
టెస్లా మోడల్ వై
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.
2025 బీవైడీ సీల్
భారతదేశంలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ అప్డేటెడ్ మోడల్ ఈ ఏడాది లాంచ్ అయింది. రూ. 41 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
BYD సీల్ డైనమిక్ 61.44 kWh బ్యాటరీ ద్వారా 510 కి.మీ పరిధి అందిస్తే.. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో 82.56 kW బ్యాటరీ ప్యాక్.. వరుసగా 650 కి.మీ & 580 కి.మీ పరిధిని అందిస్తుందని సమాచారం.
2025 బీవైడీ అట్టో
రూ. 24.99 లక్షల ఖరీదైన 2025 బీవైడీ అట్టో కారు.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు, అప్‌గ్రేడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది కూడా డైనమిక్, ప్రీమియం & సుపీరియర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డైనమిక్ 49.92 kWh బ్యాటరీ 468 కి.మీ, ప్రీమియం & సుపీరియర్ వేరియంట్‌లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 580 కి.మీ. రేంజ్ అందిస్తాయి.
BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVలో డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ అనే మూడు వేరియంట్‌లు ఉన్నాయి. BYD Atto 3 డైనమిక్ 49.92 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ARAI పరిధి 468 కి.మీ. BYD Atto 3 ప్రీమియం మరియు సుపీరియర్ వేరియంట్‌లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి, ARAI క్లెయిమ్ చేసిన పరిధి 580 కి.మీ.


