బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్: రూ.2 లక్షల కంటే తక్కువే.. | Top Five Sports Bikes Under Rs 2 Lakh in India Automobile | Sakshi
Sakshi News home page

బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్: రూ.2 లక్షల కంటే తక్కువే..

Nov 17 2025 9:21 PM | Updated on Nov 17 2025 9:27 PM

Top Five Sports Bikes Under Rs 2 Lakh in India Automobile

అభివృద్ధి చెందిన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో.. దాదాపు అన్ని బైకులు అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్.. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులు గురించి తెలుసుకుందాం.

యమహా R15 V4
రూ. 1.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద ఉన్న యమహా ఆర్15 వీ4.. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ బిగినర్స్ స్పోర్ట్‌బైక్‌లలో ఒకటి. ఇది మంచి స్టైల్, అద్భుతమైన హ్యాండ్లింగ్, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇందులో 155సీసీ ఇంజిన్ 18.2 Bhp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 11 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్.. వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) & ట్రాక్షన్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

సుజుకి జిక్సర్ SF
సుజుకి జిక్సర్ SF ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో కూడా 155 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 13.2 Bhp పవర్, 13.8 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ కలిగి ఉండటం వల్ల.. అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ వినియోగదారులకు తగ్గట్టు ఉన్నాయి.

బజాజ్ పల్సర్ RS200
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ RS200 ధర రూ. 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9,750 rpm వద్ద 24 bhp & 8,000 rpm వద్ద 18.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది. స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

సుజుకి జిక్సర్ SF 250
స్పోర్ట్స్ బైక్ జాబితాలో లభించే మరో బైక్.. సుజుకి జిక్సర్ SF 250. దీని ధర రూ. 1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫుల్ ఫెయిర్డ్ డిజైన్ కలిగిన ఈ బైక్.. 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ ద్వారా.. 9,300 rpm వద్ద 26 bhp & 7,300 rpm వద్ద 22.2 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్.. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ పొందుతుంది.

ఇదీ చదవండి: ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలు

హీరో కరిజ్మా XMR
రూ. 1.84 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే.. హీరో కరిజ్మా XMR బైక్ కూడా చెప్పుకోదగ్గ స్పోర్ట్స్ బైక్. ఇది ప్రత్యేకించి బిగినర్స్ ఫ్రెండ్లీ స్పోర్ట్‌ బైక్. ఇందులో 210 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.5 పీఎస్ పవర్, 20.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement