టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నెక్సాన్ EV దేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.
2020లో తన మొట్టమొదటి నెక్సాన్ ఈవీని లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రారంభంలో నెలకు 300 నెక్సాన్ కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఆ తరువాత నెలకు 3000 యూనిట్లను విక్రయించగలిగింది. ఇప్పుడు భారతీయ రోడ్లపై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటాను కలిగి ఉంది.
ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
టాటా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ రానున్న రోజుల్లో.. సియెర్రా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ అవుతాయి.


