2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.
హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).
కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్పర్ క్లచ్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్‌లో అపాచీ ఆర్‌టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ మోటార్‌సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 46.4 హెచ్‌పి & 5,650 ఆర్‌పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్‌ఎ గోల్డ్‌స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్‌తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్‌పి & 43.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.


