కవాసకి ఇండియా ఇటీవలే 2026 వెర్షన్ నింజా 650ను లాంచ్ చేసింది. ఇప్పుడు బ్రాండ్ తన 'వెర్సిస్ 650' అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు ప్రవేశపెట్టింది. ధర మునుపటి మోడల్ కంటే రూ. 15,000 ఎక్కువ.
కంపెనీ లాంచ్ చేసిన.. లేటెస్ట్ వెర్సిస్ 650 బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. ఎటువంటి యాంత్రిక మార్పులు పొందలేదు. కాబట్టి అదే 649 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 హెచ్‌పి పవర్.. 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, ఉత్తమ పనితీరును అందిస్తుంది.
కవాసకి వెర్సిస్ 650 కొత్త పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది మెటాలిక్ స్పార్క్ బ్లాక్‌తో కూడిన మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, డార్క్ షేడ్. ఈ వెర్షన్ ప్రస్తుతం 2025 వెర్షన్‌తో పాటు అమ్మకానికి ఉంది. ఈ లేటెస్ట్ బైక్.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, ఎకనామిక్ రైడింగ్ ఇండికేటర్, ఫోర్ వే అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.


