కవాసకి కంపెనీ 2026 నింజా 300 లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్ మెకానికల్స్ కలిగి ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ కలర్ (లైమ్ గ్రీన్ & క్యాండీ లైమ్ గ్రీన్/ఎబోనీ) ఆప్షన్స్ పొందుతుంది.
కొత్త కవాసకి నింజా 300 కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. అదే 296 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఈ మోటార్ 11,000 rpm వద్ద 39 hp శక్తిని & 10,000 rpm వద్ద 26.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొంత వరకు గ్రాఫిక్ డిజైన్ పొందుతుంది.
2026 మోడల్ అయినప్పటికీ.. కవాసకి నింజా 300 బైక్‌లో పెద్దగా మార్పులు లేవు. ప్రొజెక్టర్లతో కూడిన సవరించిన హెడ్‌ల్యాంప్ సెటప్, పెద్ద విండ్‌షీల్డ్‌తో సహా కొన్ని చిన్న అప్‌డేట్‌లు కనిపిస్తాయి. ఫీచర్ల విషయానికొస్తే, నింజా 300 చాలా సరళమైన మోటార్‌సైకిల్.. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.


