యమహా కంపెనీ తన ఎక్స్ఎస్ఆర్155 బైకును మెటాలిక్ బ్లాక్ కలర్ ఎంపికలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్‌లు పొందుతుంది. కాగా ఈ బైక్ మెటాలిక్ బ్లూ, వివిడ్ రెడ్, మెటాలిక్ గ్రే మరియు గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
కలర్స్ వారీగా ధరలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లూ: రూ. 1.50 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 వివిడ్ రెడ్: రూ. 1.53 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ గ్రే: రూ. 1.57 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్: రూ. 1.59 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లాక్: రూ. 1.59 లక్షలు
2025 నవంబర్‌లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్ఎస్ఆర్155 బైక్.. 155 సీసీ విభాగంలో ప్రీమియం విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 155 సీసీ లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్ 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్155 కొత్త కలర్ బైక్.. రంగు కాకుండా.. ఇతర మార్పులు లేదని స్పష్టమవుతోంది.


