బంగారం, వెండి వ్యాపార రంగంలో ఒకటైన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ అనుబంధ సంస్థ.. ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో తన కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 95వ శాఖ కాగా, హైదరాబాద్‌లో 6వది, తెలంగాణలో 9వ కేంద్రం ద్వారా సేవలు అందిస్తోంది.
ఈ కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రం ద్వారా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు పారదర్శక, శాస్త్రీయ, బాధ్యతాయుత బంగారం రీసైక్లింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు తమ పాత, ఉపయోగించిన బంగారు ఆభరణాలను సురక్షితంగా విక్రయించవచ్చు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను కస్టమర్లు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పారదర్శక విధానాన్ని సంస్థ అమలు చేస్తోంది. రూ.10,000 వరకు విలువైన బంగారానికి తక్షణ నగదు చెల్లింపు లభిస్తుంది. అంతకుమించిన మొత్తాలు IMPS, NEFT లేదా RTGS ద్వారా సురక్షితంగా నగదు బదిలీ చేస్తారు.


