రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే! | Silver Price All Time High in India; Know The Reasons Here | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!

Mar 2 2026 3:11 PM | Updated on Mar 2 2026 3:44 PM

Silver Price All Time High in India; Know The Reasons Here

బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.

వెండి ధరలు పెరగడానికి కారణాలు
➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.
➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.
➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.

రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement