EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే? | Provident Fund Body EPFO Retains 8 25 Percent Interest For 2025 26 | Sakshi
Sakshi News home page

EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?

Mar 2 2026 4:53 PM | Updated on Mar 2 2026 5:29 PM

Provident Fund Body EPFO Retains 8 25 Percent Interest For 2025 26

ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందా.. అని ఎదురు చూసేవారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగానే నిర్ణయించారు. అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదన్నమాట.

ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. సీబీటీ నిర్ణయం తర్వాత.. 2025-26 సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఏడు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!

Advertisement
 
Advertisement
Advertisement