వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌ | latest update on inoperative EPFO accounts | Sakshi
Sakshi News home page

వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Feb 25 2026 12:14 PM | Updated on Feb 25 2026 1:56 PM

latest update on inoperative EPFO accounts

వినియోగంలో లేని (ఇనాపరేటివ్‌) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్‌ చేయడంపై ఈపీఎఫ్‌వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్‌ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్‌ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.

ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్‌ ఖాతాలను ఇనాపరేటివ్‌గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్‌ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఈపీఎఫ్‌ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. 

ఇదీ చదవండి: పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా?

ఖాతాదారు చనిపోతే..

ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్‌వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది. (EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభం!)

ఇదీ చదవండి: ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement