‘ప్రేమకు సహకరించాడని కాళ్లు విరగ్గొట్టారు’ | Intercaste Love Incident in Karnataka | Sakshi
Sakshi News home page

‘ప్రేమకు సహకరించాడని కాళ్లు విరగ్గొట్టారు’

Feb 25 2026 1:29 PM | Updated on Feb 25 2026 2:05 PM

Intercaste Love Incident in Karnataka

కర్ణాటక: పాండవపుర తాలూకా డింకా గ్రామంలో యువతి అదృశ్యం అయ్యేందుకు వ్యక్తి కారణమని ఆరోపిస్తూ దుండగులు దాడి చేశారు. వివరాలు.. కె.ఆర్‌.పేట తాలూకాలోని బొమ్మలాపూర్‌ గ్రామానికి చెందిన నింగన్న కుమార్తె ఒక యువకుడిని ప్రేమించి అదృశ్యమైంది. అదే గ్రామానికి చెందిన ప్రకాష్‌ ఆమెకు సహాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కె.ఆర్‌.పేట గ్రామీణ పోలీసులు ప్రకాష్‌ పై కేసు నమోదు చేశారు. 

ఈ విషయంపై అమ్మాయి సోదరుడు సంజయ్‌ అడగడంతో నవీన్‌ వర్గం సంజయ్‌పై దాడి చేసిందని చెబుతున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. గిరీష్, సంజు, మంజు, జీవన్, శశికుమార్, మదన్, ముద్దప్ప, పవన్, మాదప్ప, నింగన్న, రవి, శివన్న అనే నిందితులు మైసూరుకు చెందిన నవీన్‌ అతడి బావమరిది ప్రకాష్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రకాష్‌ రెండు కాళ్లు విరిగిపోయియి. ప్రకాష్‌ ను వెంటనే పాండవపుర ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం మైసూర్‌లోని కె.ఆర్‌.ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు నిందితుడు గిరీష్‌ ను అదుపులోకి తీసుకుని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement