సినిమా ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య ప్రవర్తన | Girl Files Cheating Case On Ravi | Sakshi
Sakshi News home page

సినిమా ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య ప్రవర్తన

Feb 25 2026 7:55 AM | Updated on Feb 25 2026 12:09 PM

Girl Files Cheating Case On Ravi

హైదరాబాద్‌: సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ ఓ యువతిని తన కార్యాలయానికి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సినీ నటిని కావాలని ఆశతో ఓ యువతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి తన స్నేహితురాలి వద్ద ఉంటోంది. ఈ నెల 18న సినిమాల్లో ఛాన్స్‌ ఉందని, హీరోయిన్‌ను చేస్తానంటూ జీఎం రవి అనే యువకుడు ఆమెను మాదాపూర్‌కు పిలిపించాడు. 

అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను పలు విధాలుగా పరీక్షించి ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్‌ వద్ద ఉన్న గ్రీన్‌మార్ట్‌  ఆఫీసుకు సాయంత్రం రమ్మన్నాడు. దీంతో ఆమె తన స్నేహితురాలిని తీసుకుని గ్రీన్‌మార్ట్‌ ఆఫీసుకు వెళ్లి రవిని కలిసింది. ఆయన తన గదిలోకి పిలిపించి టెస్ట్‌ పేరిట అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనతో పాటు తన స్నేహితురాలితో కూడా అనుచితంగా వ్యవహరించాడని, సినిమాల్లో వేషం పేరుతో, తనను పరీక్షల పేరుతో ఇష్టానుసారంగా తాకుతూ  ఇబ్బంది పెట్టాడంటూ  బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement