పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా? | Can You Take Loan From EPF Account? Know The Rules | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా?

Feb 19 2026 7:14 PM | Updated on Feb 19 2026 7:31 PM

Can You Take Loan From EPF Account? Know The Rules

ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్‌ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement