breaking news
inoperative PF accounts
-
ఈపీఎఫ్ఓ అప్డేట్.. డబ్బు ఆటో రీఫండ్
ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) దశాబ్దాలుగా క్లెయిమ్ కాకుండా పడివున్న చందాదారుల డబ్బును నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏళ్ల తరబడి నిద్రాణంగా (ఇన్ఆపరేటివ్) ఉండి రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలలో ఇప్పటికే 1.18 లక్షల ఖాతాదారుల బ్యాంకు వివరాలను ఆధార్ డేటాతో అనుసంధానించి ధ్రువీకరించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.ఈపీఎఫ్ఓ 2.0 సంస్కరణల్లో భాగంగా ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చందాదారులు ఎలాంటి దరఖాస్తులు లేదా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే వడ్డీతో సహా వారి సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి ఆటో-క్రెడిట్ కానుంది.సీ-డాక్ సాఫ్ట్వేర్రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న 7.11 లక్షల ఖాతాల్లో మొత్తం రూ.30.52 కోట్ల సొమ్ము ఆమోదం లేకుండా పడి ఉంది. ఈ భారీ ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సీ-డాక్’ సంస్థ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ వ్యవస్థ సభ్యులు క్లెయిమ్ చేస్తేనే స్పందిస్తుంది. కానీ ఈ విధానంలో సభ్యుల ప్రమేయం లేకుండానే సిస్టమ్ జనరేటెడ్ క్లెయిమ్ సదుపాయాన్ని సీ-డాక్ అభివృద్ధి చేస్తోంది.బ్యాంక్ ఖాతాల ధ్రువీకరణలో భాగంగా ‘పెన్నీ డ్రాప్’ విధానాన్ని అమలు చేయగా మరణించిన ఖాతాదారుల వివరాలు కూడా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.భవిష్యత్తు ప్రణాళికలు.. మానవ ప్రమేయానికి స్వస్తిఈ మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మిగిలిన 24.76 లక్షల మంది చందాదారులకు కూడా ఇదే రీతిలో ఆటో రిఫండ్ ప్రక్రియను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా దాదాపు 31.86 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.10,903 కోట్ల నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2014లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయింపుతో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రక్షాళన, కార్మికులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభతరమైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం -
వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని (ఇనాపరేటివ్) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్ చేయడంపై ఈపీఎఫ్‌వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్ ఖాతాలను ఇనాపరేటివ్‌గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఈపీఎఫ్ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. ఇదీ చదవండి: పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా?ఖాతాదారు చనిపోతే..ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్‌వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది. (EPFO 3.0: పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభం!)ఇదీ చదవండి: ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా? -
ఆ పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
హైదరాబాద్: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వాడుకలోలేని పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక అందించారు. వాడుకలో లేని పీఎఫ్ అకౌంట్లకు 8.8 శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం (ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుందని దత్తాత్రేయ పీటీఐకి తెలిపారు. 2011 నుంచి వడ్డీ చెల్లించని ఈ ఈపీఎఫ్ అకౌంట్లకు వడ్డీ చెల్లించడం ద్వారా ఆయా ఖాతాలను వాడుకలోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నోటిషికేషన్ విడుదల చేయనున్నదని ఆయన సోమవారం తెలిపారు. తమ నిర్ణయం దాదాపు 9.70 కోట్ల మంది కార్మికులకు లేదా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లావాదేవీలు జరపని అకౌంట్లలో రూ.42 వేల కోట్ల నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.సంబంధిత ఫైల్స్ పై ఇప్పటికే తాను సంతకం చేశానని, మరోవారంలోగానే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఇది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే దీపావళి కానుక అని ప్రకటించారు. పీఎఫ్ ఉపసంహరించుకోవడానికి ఇష్టపడని , లావాదేవీలు జరపని ఖాతాదారులు కూడా ఇక ముందు వడ్డీ పొందడానికి అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇది సురక్షితమైన పెట్టుబడిగా ఉండి, ఇవాళ కాకపోతే రేపు హక్కుదారులకు చెల్లిస్తామన్నారు. ఈపీఎఫ్ విషయంలో గత 36 నెలలుగా లావాదేవీలు జరపని ఖాతాలను "పనిచేయని" గా వర్గీకరిస్తారు. ఇలాంటి ఖాతాలను గుర్తించే పనిలోఉన్నామని, ఈ ప్రక్రియ ముగియగానే ఖాతాలకు వడ్డీ పంపిణీ ప్రారంభిస్తామని దత్తాత్రేయ చెప్పారు.అన్ని ప్రభుత్వ రంగాల్లో సామాజిక భద్రతా పథకం పెంచాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలోభాగంగా ఇపీఎఫ్ఓ నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరాన్ని ఉంది అన్నారు. కాబట్టి ప్రస్తుత జోనల్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయబడుతుందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక జోనల్ కార్యాలయం ఏర్పాటు కానున్నట్టుచెప్పారు. ఈ అంశంపై నేడు (మంగళవారం) వివరంగా చర్చించడానికి ఇపిఎఫ్ఓ సమీక్షా సమావేశమవుతోందని తెలిపారు. అలాగే ఇపిఎఫ్ఓ , పెట్టుబడులు పునర్నిర్మాణ తదితర సమస్యలపై ధర్మకర్తల మండలి తదుపరి సమావేశంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతరులతో చర్చించనున్నట్టు తెలిపారు.


