ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.
కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి


