'వెండి దొరకడం కష్టం': కియోసాకి | Rich Dada Poor Dad Robert Kiyosaki Say TESLA Cannot Get Silver | Sakshi
Sakshi News home page

'వెండి దొరకడం కష్టం': కియోసాకి

Jan 16 2026 4:05 PM | Updated on Jan 16 2026 4:22 PM

Rich Dada Poor Dad Robert Kiyosaki Say TESLA Cannot Get Silver

సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.

వెండి ధరలు పెరగడానికి కారణాలు
వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement