కారు ఉపయోగించే చాలామంది.. లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే, అనవసరమైన వస్తువులనే ఎక్కువ ఉంచుకుంటున్నారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ముఖ్యమైన 10 వస్తువులు ఏవి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జంపర్ కేబుల్స్: వాతావరణంలో జరిగే మార్పులు లేదా ఇతర పొరపాట్ల కారణంగా లైట్లు ఆఫ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ డెడ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో జంపర్ కేబుల్స్ ఉంటే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు.
జాక్ & స్పేర్ టైర్: అనుకోని సందర్భాల్లో టైర్ పంక్చర్ అయితే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ టైర్ & జాక్ వంటి వాటిని కారులోనే ఉంచుకోవడం వల్ల.. టైర్ పంక్చర్ సమయంలో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఫస్ట్ ఎయిడ్ కిట్: కేవలం కారులో మాత్రమే కాకుండా.. ప్రతి వాహనంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ వైప్స్, ట్వీజర్స్, పెయిన్ రిలీవర్స్ వంటి అవసరమైన వస్తువులు ఉండాలి.
టైర్ ప్రెజర్ గేజ్: టైర్లు బయటికి సరిగానే కనిపించినా, లోపల గాలి ఒత్తిడి సరైన స్థాయిలో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.
అదనపు బ్యాటరీలతో ఫ్లాష్‌లైట్: కారులో తప్పకుండా ఫ్లాష్‌లైట్ ఉండాలి. దీనికి అదనపు బ్యాటరీలు కూడా చాలా అవసరం. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఫ్లాష్‌లైట్ ఉపయోగపడుతుంది. కారు బానెట్ క్రింద పరిశీలించాల్సినప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.
ఎమర్జెన్సీ బ్లాంకెట్: చలికాలంలో లేదా వాహనం ఆగిపోయినప్పుడు ఒక బ్లాంకెట్ తప్పకుండా అవసరం అవుతుంది. ఇది అత్యవసర సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది.
మల్టీటూల్ (స్విస్ ఆర్మీ నైఫ్): చిన్న చిన్న పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్నదే అయినా.. చాలా సందర్భాల్లో పనికొస్తుంది. దీనిని మీరు గ్లోవ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు.
వాటర్ బాటిల్: వాటర్ బాటిల్ కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే కాదు. అనుకోని సందర్భాల్లో గాయాలైనప్పుడు, వాటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూడా నీళ్లు అవసరమవుతాయి. సీల్ చేసిన బాటిల్స్ ఉంచుకోవడం మంచిది.
ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్: ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఉండడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ ఆఫ్ కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు జీపీఎస్ న్యావిగేషన్ లేదా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ చాలా అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ కాకుండా ఉంచడానికి ఫోన్ ఛార్జర్ & పవర్ బ్యాంక్ తప్పనిసరిగా మీతో ఉంచుకోవాలి.
వెహికల్ రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్: కారుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా కారులో ఉంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులు మీ కారును చెక్ చేసే సమయంలో వెంటనే చూపించడానికి ఇవి పనికొస్తాయి.


