నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్! | Mahindra XEV 9S XUV 7XO Log 93689 Bookings Combined on First Day | Sakshi
Sakshi News home page

నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!

Jan 16 2026 2:57 PM | Updated on Jan 16 2026 3:39 PM

Mahindra XEV 9S XUV 7XO Log 93689 Bookings Combined on First Day

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 2026 జనవరి 14న.. నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్‌లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని కార్ల తయారీదారు తెలిపారు.

కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు లాంచ్‌కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్‌లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్‌ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ ధృవీకరించింది.

ఇక మహీంద్రా XEV 9S విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఇది 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!

టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు కూడా మంచి బుకింగ్స్ పొందింది. మొదటి రోజే ఏకంగా 70000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును మహీంద్రా కార్లు అధిగమించాయి. బుకింగ్లలో ఎప్పటికప్పుడు మహీంద్రా కంపెనీ కొత్త మార్క్ చేరుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి కార్లు కూడా గతంలో గొప్ప అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement