భారతదేశంలో టయోటా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. దీంతో.. అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద SUVలలో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్ రేటు గరిష్టంగా రూ. 74వేలు వరకు పెరిగింది.
ధరల పెరుగుదల.. వేరియంట్లను బట్టి రూ. 51వేలు నుంచి రూ. 74వేలు మధ్య ఉంది. కాగా కంపెనీ లిమిటెడ్-రన్, డీలర్-లెవల్ లీడర్ వేరియంట్‌లను నిలిపివేసింది. ఫార్చ్యూనర్ & లెజెండర్ వరుసగా ₹ 74,000 మరియు ₹ 71,000 వరకు ధర పెరిగాయి. ఎంట్రీ-లెవల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 51వేలు పెరిగింది. దీంతో ఈ SUV ధర ఇప్పుడు రూ. 33.65 లక్షల నుంచి రూ. 34.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.
ఇన్నోవా క్రిస్టా ధరలు
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్‌ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.


