ట్రేడింగ్‌కు కనీస అర్హత ఉండాలి | NSE CEO Ashish Chauhan comments on futures and options trading stock market | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌కు కనీస అర్హత ఉండాలి

Feb 27 2026 8:58 AM | Updated on Feb 27 2026 9:40 AM

NSE CEO Ashish Chauhan comments on futures and options trading stock market

డెరివేటివ్స్‌(ఎఫ్‌అండ్‌వో)లో పాలుపంచుకునే ఇన్వెస్టర్లకు కనీస అర్హతా ప్రమాణాలు ఉండాలని స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా బలహీనవర్గాలు లేదా కనీస అవగాహనలేని ప్రజలు స్పెక్యులేషన్‌తో సొమ్మును వృధా చేసుకోకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

నిజానికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లలో 90 శాతంమంది సొమ్ము నష్టపోతున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పదేపదే వెల్లడిస్తున్న నేపథ్యంలో చౌహాన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అంతంతమాత్రం ఆదాయాలు, అవగాహన ఉండే సామాన్య ప్రజానీకం తమ సొమ్మును, వనరులను, ఎనర్జీని స్పెక్యులేషన్‌పై వృధా చేసేందుకు ఏ వర్ధమాన దేశమూ అనుమతించబోదని చౌహాన్‌ పేర్కొన్నారు.

డెరివేటివ్స్‌ లావాదేవీలు చేయాలంటే కనీస అర్హత ప్రమాణాలు ఉండేలా నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు ఇక్కడ జరిగిన ఒక సదస్సులో అభిప్రాయపడ్డారు. యూఎస్, సింగపూర్‌ తదితర దేశాలలో ఉన్న నియంత్రణలతరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో కనీస అవగాహనలేని సామాన్య ప్రజలు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకోవచ్చని, తద్వారా వారు నష్టపోకుండా నివారించవచ్చని వివరించారు.

ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement