ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే | SEBI Chairman Tuhin Kanta Pandey comments on AI | Sakshi
Sakshi News home page

ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే

Feb 27 2026 9:08 AM | Updated on Feb 27 2026 9:53 AM

SEBI Chairman Tuhin Kanta Pandey comments on AI

పర్యవేక్షణ, పాదర్శకత పెరుగుతాయ్‌

సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే 

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పర్యవేక్షణను పటిష్టపరచడం, రిస్క్‌ నిర్వహణ, పారదర్శకతతోపాటు.. ఇన్వెస్టర్‌ అవగాహనను సైతం పెంపొందించేందుకు వీలుంటుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొటక్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సందర్భంగా దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుద్ధేశించి పాండే ప్రసంగించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మార్కెట్‌ నాణ్యత, పాలనా ప్రమాణాలు, సమాచార వెల్లడి, లిక్విడిటీ, సంస్థల బలిమి ద్వారా తదుపరి వృద్ధి ప్రతిఫలిస్తుందని వివరించారు. సప్లై చైన్‌లో మార్పులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వాతావరణం సంక్షిష్టంగా మారుతున్నదని పాండే పేర్కొన్నారు. వెరసి వృద్ధి అనేది రిటర్నులపైకాకుండా నిలకడ, నమ్మకం(క్రెడిబిలిటీ), వాస్తవిక అంచనాలు తదితరాలకు సంబంధించిన అంశంగా మారుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Advertisement
 
Advertisement
Advertisement