ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Close February 25 2026 | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Feb 25 2026 3:50 PM | Updated on Feb 25 2026 5:09 PM

Stock Market Close February 25 2026

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడే లాభాలను వదులుకున్నప్పటికీ భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ముగియగలిగాయి. మెటల్, ఐటీ స్టాక్స్ లో లాభాలు మొత్తంగా నష్టాలను తగ్గించాయి. 

నిఫ్టీ 57.85 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 25,482.50 వద్ద, సెన్సెక్స్ 0.06 శాతం లేదా 50.15 పాయింట్లు లాభపడి 82,276.07 వద్ద ముగిశాయి.

సెన్సెక్స్ లోని 30 షేర్లలో  టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, సుఫార్మా, టీసీఎస్  ఎగిశాయి. 2 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.14 శాతం, స్మాల్ క్యాప్ 100 0.45 శాతం లాభపడ్డాయి. ఇండియా బీఐఎక్స్ 5 శాతానికి పైగా తగ్గి 14.15 వద్ద ముగిసింది.

రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడగా, ఆటో, ఐటీ ఇండెక్స్ ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. విస్తృత మార్కెట్లో, అమెరికా దిగుమతి సుంకాల ప్రకటన తరువాత సోలార్‌ సంబంధిత స్టాక్స్ 14 శాతం వరకు పడిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement