మరో కొత్త కారు.. మార్కెట్లోకి టేరాన్‌ ఆర్‌-లైన్‌ | Volkswagen Launches New Tayron R Line in india | Sakshi
Sakshi News home page

మరో కొత్త కారు.. మార్కెట్లోకి టేరాన్‌ ఆర్‌-లైన్‌

Feb 25 2026 3:00 PM | Updated on Feb 25 2026 3:05 PM

Volkswagen Launches New Tayron R Line in india

ముంబై: ప్రముఖ ఆటో మోబైల్‌ దిగ్గజం వోక్స్‌ వ్యాగన్‌ సరికొత్త కారును మార్కెట్‌ లోకి లాంచ్‌ చేసింది. వ్యాగన్‌ టేరాన్‌ ఆర్‌–లైన్‌ పేరుతో వచ్చిన ఈ 7 సీటర్‌ ఎస్‌యూవీ ధర రూ.46.99 లక్షలుగా (ప్రారంభ ఎక్స్‌-షోరూం ధర) కంపెనీ నిర్ణయించింది.

డిజైన్‌ పరంగా ఈ వాహనం ముందుభాగంలో ఐక్యూ లైట్‌తో కూడిన హెడ్‌ మ్యాట్రిక్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లున్నాయి.ఈ టేరాన్‌ ఆర్‌–లైన్‌లో 2.0–లీటర్‌ టీఎస్‌ఐ ఈఏ888 ఈవోఓ4 పెట్రోల్‌ ఇంజిన్‌ అందించారు. ఈ శక్తివంతమైన ఇంజిన్‌ గరిష్టంగా 204 పీఎస్‌ పవర్, 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7–స్పీడ్‌ డీఎస్‌జీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జతచేశారు. 4మోషన్‌ ఆల్‌–వీల్‌ డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్‌ వాహనానికి మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తుంది.

టెక్నాలజీ విషయానికి వస్తే, రెండు హై–పవర్‌ యూఎస్‌బీ–సీ (45డబ్ల్యూ) పోర్ట్‌లు, రెండు మొబైల్‌ ఫోన్‌ల కోసం వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇవ్వడం ద్వారా కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదనంగా, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) హెడ్‌–అప్‌ డిస్‌ప్లే ద్వారా నావిగేషన్, వేగం వంటి ముఖ్యమైన సమాచారం డ్రైవర్‌కు నేరుగా విండ్‌స్క్రీన్‌పై ప్రొజెక్ట్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement