కొత్త బీఎండబ్ల్యూ కారు లాంచ్: ధర ఎంతంటే? | BMW X3 30 xDrive M Sport Pro Launched in India | Sakshi
Sakshi News home page

కొత్త బీఎండబ్ల్యూ కారు లాంచ్: ధర ఎంతంటే?

Feb 16 2026 5:41 PM | Updated on Feb 16 2026 5:47 PM

BMW X3 30 xDrive M Sport Pro Launched in India

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియన్ మార్కెట్లో ఎక్స్3 30 xDrive ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. రూ. 74.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 & వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

BMW X3 30 xDrive M స్పోర్ట్ ప్రో కారు.. బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, ఆల్పైన్ వైట్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ & బ్లాక్ సఫైర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది 258 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అప్షన్ ఇందులో ఉంటుంది.

ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ముందు భాగంలో బ్లాక్ కిడ్నీ గ్రిల్, కార్నరింగ్ లైట్లు, షాడోలైన్ డిటెయిలింగ్‌తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, రెడ్ కలర్ స్పోర్ట్స్ బ్రేక్స్ పొందుతుంది. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ షేప్ ఎల్ఈడీ ల్యాంప్‌లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & రూఫ్ స్పాయిలర్ ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్,  14.9-అంగుళాల కంట్రోల్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి కాకుండా.. పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, హర్మాన్ కార్డాన్ ఆడియో & ట్రావెల్ & కంఫర్ట్ సిస్టమ్ ద్వారా సీమ్‌లెస్ కనెక్టివిటీ, ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement