జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త లుక్‌ను సెప్టెంబర్ 2025లో మొదట iX3లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కంపెనీ ఫిబ్రవరి నుంచి అన్ని ఇతర కార్లకు దీనిని ఉపయోగించనుంది.
బీఎండబ్ల్యూ కొత్త లోగోలో చెప్పుకోదగ్గ అప్డేట్ కనిపించదు, కానీ సూక్ష్మమైన మార్పులు గమనించవచ్చు. ఇది వరకు ఉన్న బ్రాండ్ లోగోలో బ్లూ, వైట్ ప్రాంతాలను విభజించిన క్రోమ్ ఉండేది. కొత్త లోగోలో ఇది కనిపించదు. BMW అక్షరాలు కూడా స్లిమ్ చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ కూడా మ్యాట్ ఫినిషింగ్ పొందుతుంది.

వారసత్వాన్ని నిలుపుకుంటూనే.. లోగోకు మరింత ఖచ్చితత్వాన్ని తీసుకురావాలనున్నామని, ఈ కారణంగా చిన్న చిన్న అప్డేట్స్ చేసినట్లు BMW బ్లాగ్స్ బ్రాండ్ డిజైన్ బాస్ ఆలివర్ హీల్మెర్ వెల్లడించారు. అప్డేట్ లోగోతో కూడిన వాహనాలు యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.


