లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్! | Tata Sierra Bookings Cross 1 Lakh Mark | Sakshi
Sakshi News home page

లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్!

Feb 6 2026 7:49 PM | Updated on Feb 6 2026 7:55 PM

Tata Sierra Bookings Cross 1 Lakh Mark

టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.

సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.

టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్‌, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement