స్కోడా ఇండియా డిసెంబర్ 2024లో కైలాక్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా తన 50,000వ కారును చకన్ ప్లాంట్‌లో విడుదల చేశారు. ఇది ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని సూచిస్తుంది.
స్కోడా కంపెనీ అమ్మకాలు పెరగడానికి కైలాక్ దోహదపడింది. ఈ కారుకు డిమాండ్ పెరగడంతో కంపెనీ చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచింది. దీనికి కేవలం ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాగా ఇది భారతదేశంలో 2025 డిసెంబర్ ప్రారంభం నుంచి 40వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.
స్కోడా కైలాక్ ధర రూ. 7.89 లక్షలతో (ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్‌యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.


