యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్‌ ఉచితం | UAE Recruitment Drive Free Visa Flight Tickets for Selected Candidates | Sakshi
Sakshi News home page

యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్‌ ఉచితం

Mar 16 2026 5:43 PM | Updated on Mar 16 2026 6:31 PM

UAE Recruitment Drive Free Visa Flight Tickets for Selected Candidates

మోర్తాడ్‌(బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్‌ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్‌లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్‌ చీటీ సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డింగ్‌ సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ బాయ్స్‌గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు.  

వేతనం, అర్హతల వివరాలు.. 

  • హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్‌ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్‌ బాయ్స్‌కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి.  

  •     డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.  

  •     స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్‌లో పని చేసిన అనుభవం అవసరం.  

  •     ఆఫీస్‌ బాయ్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్‌ మాట్లాడగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.  

    మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు  gulfjobsgtm @gmail.com మెయిల్‌కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్‌ (83320 62299), నిజామాబాద్‌ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement