దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.
నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.
అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.
సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది.



