బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు | Gold and Silver rates on evening 16th March 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు

Mar 16 2026 6:42 PM | Updated on Mar 16 2026 6:49 PM

Gold and Silver rates on evening 16th March 2026 in Telugu states

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. సోమవారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం రూ.450 తగ్గి రూ.1,45,900 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.2050 క్షీణించి రూ.1,44,300 లకు దిగివచ్చింది.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సోమవారం ఉదయం రూ.490 తగ్గి రూ.1,59,170 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.2240 కరిగి రూ. 1,57,420 లకు క్షీణించింది.

ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గిన వెండి సాయంత్రానికి రూ.4000 క్షీణించి రూ.2,76,000 వద్దకు దిగివచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement