మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో EQS SUV సెలబ్రేషన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV 450, 580 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ.1.34 కోట్లు & రూ.1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).
మెర్సిడెస్ బెంజ్ EQS సెలబ్రేషన్ ఎడిషన్ AMG లైన్ ట్రిమ్ ఆధారంగా తయారైంది. ఇందులో గ్లాస్ బ్లాక్ రంగులో కనిపించే బ్లాంకెడ్ ఆఫ్ ఫ్రంట్ ఫాసియా, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు & 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో EQS మూడు స్క్రీన్‌లు, వెంటిలేషన్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, MBUX టాబ్లెట్‌ను కలిగి ఉన్న రియర్ సీటు పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!
EQS సెలబ్రేషన్ ఎడిషన్ 122 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది ఒక జత ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిస్తుంది. 450 వేరియంట్ 355 bhp మరియు 800 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6.2 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇది ఒక ఛార్జితో 775 కిమీ పరిధిని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. 580 వేరియంట్ 536 bhp మరియు 858 Nm టార్క్ అందిస్తూ.. 809 కిమీ ప్రయాణించగలదు.


